
అమరావతి, 06 జనవరి (హి.స.)
అమలాపురం: చిరంజీవి ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా అమలాపురంలో ఈ సినిమా (
టికెట్‌ను ఒక అభిమాని వేలంపాటలో రూ.1.11లక్షలకు సొంతం చేసుకున్నారు. పట్టణంలోని వెంకటరమణ థియేటర్‌లో ఈ వేలంపాట జరగ్గా.. మెగా అభిమాని వెంకట సుబ్బారావు ఈ టికెట్‌ను దక్కించుకున్నారు.
చిరంజీవి సరసన నయనతార కనిపించనున్న ఈ సినిమాలో వెంకటేశ్ అతిథి పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ