
తిరుపతి, 06 జనవరి (హి.స.) జిల్లా,:తిరుపతి జిల్లాలోని వడమాలపేట మండలంలో ఎస్ఐ హరీశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. పుత్తూరు నుంచి వడమాలపేట మీదుగా రేణిగుంట వైపు అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఓ లారీలో తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈమేరకు పోలీసులు సోదాలు జరిపి భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ