
హైదరాబాద్, 06 జనవరి (హి.స.)
జగిత్యాల జిల్లాలోని చిలక వాగు వర్షాకాలంలో వరదనీటితో నిండిపోతూ, మిగతా కాలంలో మురికి కాలువలా మారిపోతూ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతోందనీ, ఈ పరిస్థితిని మార్చేందుకు చిలక వాగు ప్రక్షాళన, అభివృద్ధి, సుందరీకరణ పై ప్రభుత్వ దృష్టిని పెట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసెంబ్లీలో విన్నవించారు. చిలక వాగు శుభ్రత, నీటి ప్రవాహం మెరుగుదల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
వాకింగ్ ట్రాక్, లైటింగ్, పచ్చదనం వంటి సౌకర్యాలతో వాగు పరిసరాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే కాకుండా, పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉందని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు