ప్రభుత్వ పాఠశాలలపై మండలి చైర్మన్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్, 06 జనవరి (హి.స.) ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ''మన ఊరు-మన బడి'' పథకం కింద రూ.360 కోట్లతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారని, ఆ నిధులను విడుదల చేయాలని శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
మండలి చైర్మన్


హైదరాబాద్, 06 జనవరి (హి.స.) ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ,

మౌలిక సదుపాయాల కల్పన కోసం 'మన ఊరు-మన బడి' పథకం కింద రూ.360 కోట్లతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారని, ఆ నిధులను విడుదల చేయాలని శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. తన సొంత గ్రామంలోనే పాఠశాల పనులు సగంలో ఆగిపోయాయని, చలికాలంలో పిల్లలు ఆరుబయట కూర్చుంటున్నారని కామెంట్ చేశారు.

నిధుల విడుదల విషయం గురించి గత ఒక సంవత్సరం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల పేమెంట్లు జరుగుతున్నాయని, కానీ ఈ ప్రభుత్వం 'మన ఊరు-మన బడి'ని 'అమ్మ ఆదర్శ పాఠశాల' అని పేరు మార్చి మైనింగ్ సెస్కు అటాచ్ చేసిందని అన్నారు. అక్కడక్కడ కొన్ని పేమెంట్లు జరుగుతున్నాయని, అయితే ప్రస్తుతం అవి కూడా ఆగిపోయాయని పేర్కొన్నారు.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు పెరిగాయని, 2024-25 విద్యా సంవత్సరం ప్రకారం ప్రభుత్వ బడుల్లో 18.5 లక్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షల మంది చదువుతున్నారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande