
సిద్దిపేట, 06 జనవరి (హి.స.)
రెండు ఏండ్లలో మళ్లీ వచ్చేది
బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో సిద్దిపేట నియోజక వర్గ బీఆర్ఎస్ సర్పంచ్ ఉప సర్పంచ్ ల ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలను చక్కగా అభివృద్ధి చేస్తే.. రెండేళ్లు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం, పల్లె ప్రగతి నిధులు ఇవ్వక పోవడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారిపోయాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యం మూలంగా గ్రామాల్లో సమస్యలు పేరుకు పోయాయని అన్నారు. ప్రతి పక్షమైన అధికార పక్ష మైనా అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు