కిక్కిరిసిన తెలంగాణ జాగృతి కార్యాలయం.. కవితకు మద్దతుగా తరలివచ్చిన జనం
హైదరాబాద్, 06 జనవరి (హి.స.) ‘తెలంగాణ జాగృతి'' రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, కార్యకర్తలు బంజారాహిల్స్ తెలంగాణ
కిక్కిరిసిన తెలంగాణ జాగృతి కార్యాలయం.. కవితకు మద్దతుగా తరలివచ్చిన జనం


హైదరాబాద్, 06 జనవరి (హి.స.)

‘తెలంగాణ జాగృతి' రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, కార్యకర్తలు బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కవితకు సంఘీభావం తెలుపుతూ మద్దతును ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి తన వెన్నంటి ఉండి, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ మద్దతుగా నిలిచిన ఉద్యమకారులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో జాగృతి కార్యాలయం పరిసర ప్రాంతాలు 'జై తెలంగాణ', 'కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి' అనే నినాదాలతో మారుమోగాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande