ప్రాథమిక పాఠశాలలో గురువుగా మారిన జోగులాంబ కలెక్టర్
జోగులాంబ గద్వాల, 06 జనవరి (హి.స.) విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై బాగా చదువుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎల్లప్పుడూ వారిని ప్రోత్సహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కేటిదొడ్డి మండలంలోని పాగుంట గ్రామం
జోగులాంబ కలెక్టర్


జోగులాంబ గద్వాల, 06 జనవరి (హి.స.)

విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై బాగా చదువుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎల్లప్పుడూ వారిని ప్రోత్సహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కేటిదొడ్డి మండలంలోని పాగుంట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధన విధానం, సౌకర్యాలపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ తప్పనిసరిగ్గా ప్రతిరోజూ తరగతులకు హాజరై.. శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల ఎఫ్.ఆర్.ఎస్ హాజరు యాప్ ను పరిశీలించి, 100శాతం హాజరు నమోదు కావాలన్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారి తెలుగు ఆంగ్ల భాషా నైపుణ్యాలను పరిశీలించి వారికి విద్యాబోధన చేశారు. కొంతమందిని బోర్డుపై చదివించడంతో పాటు ప్రశ్నలు అడిగి వారి విద్య సామర్ధ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాథమిక విద్యే జీవితానికి పునాది అని పేర్కొంటూ, అక్షరాభ్యాసం, చదవడం, రాయడం, అర్థం చేసుకునే నైపుణ్యాలు పక్కాగా నేర్పాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande