
జనగామ, 06 జనవరి (హి.స.)
నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభ మంగళవారం జనగామలో జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సభలో మాట్లాడిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, యూరియా కోసం రైతులు చలిలో క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎనకటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్లీ అదే పరిస్థితులను రాష్ట్రానికి తెచ్చింది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు