మేడారం మహా జాతరకు అధికారులు సిద్ధం.. ఈనెల 19న రానున్న సీఎం రేవంత్ రెడ్డి
ములుగు, 06 జనవరి (హి.స.) మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు యంత్రాంగం సిద్ధమవుతుంది. ఓవైపు పనులను యుద్ధప్రాతిపదకన చేపడుతూనే ఇతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జాతర జరిగే సమయంలో ఉద్యోగులు విధులు నిర్వర్తించే విధంగా ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జి
మేడారం జాతరకు


ములుగు, 06 జనవరి (హి.స.) మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు యంత్రాంగం సిద్ధమవుతుంది. ఓవైపు పనులను యుద్ధప్రాతిపదకన చేపడుతూనే ఇతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జాతర జరిగే సమయంలో ఉద్యోగులు విధులు నిర్వర్తించే విధంగా ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులు, పోలీసులను కేటాయిస్తున్నారు. జాతర సందర్భంగా 30వేల మంది ఉద్యోగులను వినియోగించడంతో పాటు భక్తులకు సరైన సేవలు అందే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు అధికారులతో సమీక్షలు నిర్వహించిన మంత్రులు ఈ నెల 19న సీఎం రేవంత్రెడ్డి రానుండటంతో ఈలోగా మెజార్టీ ఉద్యోగులను నియమించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గద్దెలతో పాటు చుట్టుపక్కల పనులన్నీ వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. బ్రిడ్జిల నిర్మాణాలు, రోడ్డు వెడల్పు కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande