
హైదరాబాద్, 06 జనవరి (హి.స.)
పీఎం ఈ డ్రైవ్ (PM E-Drive) కింద 575 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని త్వరలోనే కొత్తగా 2800 ఈవీ బస్సులు వస్తున్నాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వాటితో పాటు వరంగల్ మున్సిపాలిటీకి 100, నిజామాబాద్ మున్సిపాలిటీకీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా 50 బస్సులు రాబోతున్నాయని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన మంత్రి.. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీని తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో లక్ష ఈవీ వాహనాలు అమ్ముడుపోయాయన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపు ఇవ్వాలని కంపెనీలను ఈ సందర్భంగా కోరామని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..