
ములుగు, 06 జనవరి (హి.స.)
మేడారం మహా జాతర సందర్భంగా మేడారంలో విధులు నిర్వహించనున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశించారు. మంగళవారం మేడారంలో పోలీస్ సిబ్బంది వసతి ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వసతుల ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం వహించవద్దని, సిబ్బందికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే విధులను సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు