యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. నల్గొండ కలెక్టర్
నల్గొండ , 06 జనవరి (హి.స.) యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామం సమీపంలోని గోదాములలోని యూరియాను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్ల
నల్గొండ కలెక్టర్


నల్గొండ , 06 జనవరి (హి.స.)

యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామం సమీపంలోని గోదాములలోని యూరియాను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, అక్రమాలకు పాల్పడిన అధికారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియా అందజేస్తుండగా రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో యూరియా అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande