ఎస్ఐర్ అమలులో స్పష్టమైన పురోగతి సాధించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, 06 జనవరి (హి.స.) ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశార
నిజామాబాద్ కలెక్టర్


నిజామాబాద్, 06 జనవరి (హి.స.)

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ అమలు తీరు, ముసాయిదా ఓటరు జాబితాపై కలెక్టర్ మంగళవారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్. ఓ సూపర్ వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఎస్.ఐ.ఆర్ అమలును పరిశీలిస్తూ, పనితీరులో వెనుకంజలో ఉన్న ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్ వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande