ఒవైసీ వర్సెస్ ఏలేటి .. అసెంబ్లీలో డైలాగ్ వార్
తెలంగాణ, 06 జనవరి (హి.స.) తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేజీ మహేశ్వర్ రెడ్డి మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఎస్ఐఆర్ విషయంలో ఇరు నేతల మధ్య సంవాదం సభలో రాజకీయ వేడి రాజేసింది. ఇవాళ శాసనసభలో అ
అసెంబ్లీలో డైలాగ్ వార్


తెలంగాణ, 06 జనవరి (హి.స.) తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం

శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేజీ మహేశ్వర్ రెడ్డి మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఎస్ఐఆర్ విషయంలో ఇరు నేతల మధ్య సంవాదం సభలో రాజకీయ వేడి రాజేసింది. ఇవాళ శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ బీహార్, బెంగాల్ లో మైనార్టీ ఓట్లు తొలగించారని మండిపడ్డారు. ఎస్ఐఆర్ రాజకీయ దుష్ప్రచారం మాత్రమేనన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఓవైసీ ఇష్టారాజ్యాంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు అపడం లేదన్నారు. ఇవాళ సభలో జరుగుతున్న చర్చ ఏమిటి? అక్బరుద్దీన్ మాట్లాడుతున్నదేమిటన్నారు. ఎస్ఐపై కావాలనుకుంటే ప్రత్యేక చర్చ పెట్టాలని అంతే తప్ప జరుగుతున్న చర్చను పక్కదారిపట్టించేలా చూడవద్దన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande