
హైదరాబాద్, 06 జనవరి (హి.స.)
రామగుండం కార్మిక క్షేత్రంలో ప్రజల
అవసరం కోసం పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదని, ఇందుకోసం మరిన్ని నిధులు కేటాయించాలని శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అసెంబ్లీ సమావేశాలలో స్పష్టం చేశారు. 3 లక్షల జనాభా ఉన్న కోల్ బెల్టు ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి సరిపోవడం లేదని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ వారు.. 140 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రిని పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఇక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం 2వేల వరకు ఆవుట్ పేషెంట్లు వస్తూ ఉంటారని,
వారికి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. 20 కోట్లతో నిర్మించిన క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులను ఎమ్మెల్యే కోరారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..