
తెలంగాణ, 06 జనవరి (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం మౌలానా
ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనది, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేయబడిందని మంగళవారం ఎక్స్ వేదికగా తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని పలు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు భూముల వినియోగంపై నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూములను కేటాయించిన సంస్థలు వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నాయనే అంశంపై వివరాలు సేకరించడం ఈ నోటీసుల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
వినియోగంలో ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాధారణ ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు