నారాయణపేట జిల్లాలో ఘాతుకం.. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం
నారాయణపేట, 06 జనవరి (హి.స.) ఓ తండ్రి ఇద్దరు పిల్లలను అత్యంత కర్కషంగా హతమార్చి.. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. మరికల్ మండల పరిధిలోని తేలేరు గ్రామానికి
నారాయణపేట క్రైమ్


నారాయణపేట, 06 జనవరి (హి.స.)

ఓ తండ్రి ఇద్దరు పిల్లలను అత్యంత కర్కషంగా హతమార్చి.. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. మరికల్ మండల పరిధిలోని తేలేరు గ్రామానికి చెందిన శివరాములు దంపతులకు రిత్విక (8), చైతన్య (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.కాగా, భార్య గతంలోనే విడాకులు ఇవ్వగా శివరాములు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పిల్లలకు క్రిమిసంహారక మందులు తాగించినట్లుగా సమాచారం. పిల్లలు త్వరగా చనిపోకపోవడంతో కోయిల్సాగర్ కాలువలోని తీసుకెళ్లి కర్కశంగా తొక్కి చంపేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం శివరాములు కూడా క్రిమిసంహారక మందు తాగినప్పటికీ ప్రాణాలు పోకపోవడంతో సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ను పట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. చివరకు చావలేక.. బతకలేని పరిస్థితులలో శివరాములు జరిగిన విషయాన్ని తెల్లవారుజామున గ్రామస్తులకు తెలిపాడు. వారు హుటాహుటిన పోలీసులతో కలిసి పిల్లలను పడేసిన కోయిల్సాగర్ కాలువ వద్దకు చేరుకున్నారు. అనంతరం పిల్లలను బయటకు తీయగా వారు అప్పటికే మృతిచెందారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివరాములుకు చికిత్స కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande