ఈనెల 10న తుది ఓటర్ జాబితా : సిద్దిపేట జిల్లా కలెక్టర్
సిద్దిపేట, 06 జనవరి (హి.స.) హుస్నాబాద్, దుబ్బాక,చేర్యాల, ప్రజ్ఞాపూర్- గజ్వేల్ మున్సిపాలిటీల తుది ఓటర్ జాబితా ఈనెల 10వ తేదీన ప్రచురించడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి తెలిపారు. పురపాలక ఎన్నికలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో మం
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 06 జనవరి (హి.స.)

హుస్నాబాద్, దుబ్బాక,చేర్యాల, ప్రజ్ఞాపూర్- గజ్వేల్ మున్సిపాలిటీల తుది ఓటర్ జాబితా ఈనెల 10వ తేదీన ప్రచురించడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి తెలిపారు. పురపాలక ఎన్నికలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మున్సిపాలిటీలలో త్వరలో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా మున్సిపల్ వార్డులలో ఓటర్ జాబితాను రూపొందించడం జరిగిందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande