జనవరి 23 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. సిద్దిపేట పోలీస్ కమిషనర్
సిద్దిపేట, 06 జనవరి (హి.స.) సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 23 వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో లు, సభలు, సమావేశాలు
Siddipet cp


సిద్దిపేట, 06 జనవరి (హి.స.)

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో

జనవరి 23 వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. కార్యక్రమాల నిర్వహణకు పోలీస్ అధికారుల అనుమతి ముందుగా తీసుకోవాలన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande