
యాదాద్రి భువనగిరి, 06 జనవరి (హి.స.)
ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని.. డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పని చేయాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ వి. హనుమంతరావు సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి మొత్తం తిరిగి చూస్తూ గదిలో చెత్త ఉండడానికి గమనించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
100% ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు జరిగేలా సిబ్బంది పనిచేయాలని.. ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు