కోనసీమ గ్యాస్ లీక్ ఎఫెక్ట్: నష్టాల్లో ఓఎన్‌జీసీ (ONGC) ఇన్వెస్టర్లలో ఆందోళన
అమరావతి, 06 జనవరి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District) లో శనివారం మధ్యాహ్నం గ్యాస్ లీక్ (Gas leak) జరిగి భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం
konaseema-gas-leak-effect-ongc-in-losses-stock-markets-511329


అమరావతి, 06 జనవరి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District) లో శనివారం మధ్యాహ్నం గ్యాస్ లీక్ (Gas leak) జరిగి భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం 'ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్' (ONGC) షేర్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొనడం, సంస్థ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తడంతో ఆ ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్‌పై పడింది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో మార్కెట్ ఆరంభం నుంచే ఓఎన్‌జీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

తాజా మార్కెట్ గణాంకాల ప్రకారం ఓఎన్‌జీసీ షేరు ధర పతనమై రూ. 238.09 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈరోజు ఉదయం మార్కెట్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే, షేరు విలువ గరిష్ట స్థాయి నుంచి కిందకు పడిపోవడం (Downward Trend) స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ లీక్ వంటి ప్రమాదాలు జరిగినప్పుడు, కంపెనీ నిర్వహణపై వచ్చే విమర్శల కారణంగా షేరు విలువలో ఇలాంటి ఒడిదుడుకులు రావడం సహజమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande