
అనంతపురం, 06 జనవరి (హి.స.)అనంతపురం (Anantapuram) జిల్లాలోని పెద్దపప్పూరు మండలం నామనాంకపల్లెలో (Namanankapalle) గ్రామ జాతర ఘనంగా జరుగుతోంది. ఈ జాతరకు పుర ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) నామనాంకపల్లిలో జరుగుతున్న గ్రామ జాతరకు హాజరయ్యేందుకు బయలుదేరారు.
ఈ క్రమంలో ఆయనను జాతరకు వెళ్లడానికి పోలీసులు అభ్యంతరం తెలిపారు. అదే సమయంలో అక్కడకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి జాతరకు వస్తున్నారనే సమాచారం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ఇరువురు ఎదురుపడితే గ్రామంలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు అంచనా వేశారని సమాచారం. ఈ క్రమంలో పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ నాయకత్వం స్పందిస్తూ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని ఆరోపించింది. జాతరకు హాజరయ్యేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV