13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం : సీఎం చంద్రబాబు
అమరావతి, 06 జనవరి (హి.స.) 2025 సంవత్సరంలో విద్యుత్ రంగంపరంగా అద్భుతంగా పని చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ పేరిట చార్జీలను పెంచితే కూటమి ప్రభుత్వం పాలనలో ట్రూడౌన్ చేస్తున్నాం అన్నారు. అందులో భాగంగా యూనిట్ కు 13 ప
సీఎం చంద్రబాబు


అమరావతి, 06 జనవరి (హి.స.)

2025 సంవత్సరంలో విద్యుత్ రంగంపరంగా అద్భుతంగా పని చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ పేరిట చార్జీలను పెంచితే కూటమి ప్రభుత్వం పాలనలో ట్రూడౌన్ చేస్తున్నాం అన్నారు. అందులో భాగంగా యూనిట్ కు 13 పైసలు ఛార్జీలను తగ్గించగలిగాం అన్నారు. మంగళవారం నిర్వహించిన 14వ ఎస్ఐపీబీ సమావేశానికి సీఎం అధ్యక్షత వహించారు. సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రూ.4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అందుకోసం సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్యఘర్ యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande