తిరుమల పరకామణి చోరీ కేసులో రవికుమార్తో కుమ్మక్కైన పోలీసులు
అమరావతి, 07 జనవరి (హి.స.)):తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును బలహీనపరిచే కుట్రలో భాగస్వాములైన పోలీసు అధికారుల పై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సీఐడీ, ఏసీబీ దాఖలు చేసిన నివేదికలను పరిశీలిస్త
తిరుమల పరకామణి చోరీ కేసులో రవికుమార్తో కుమ్మక్కైన పోలీసులు


అమరావతి, 07 జనవరి (హి.స.)):తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును బలహీనపరిచే కుట్రలో భాగస్వాములైన పోలీసు అధికారుల పై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సీఐడీ, ఏసీబీ దాఖలు చేసిన నివేదికలను పరిశీలిస్తే, నిందితుడు రవికుమార్‌ తదితరులతో కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని స్పష్టమౌతుందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే సరైన సెక్షన్లు నమోదు చేయలేదని తెలిపింది. ఈ నేపఽథ్యంలో పరకామణి చోరీ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవడం మినహా సరైన సెక్షన్లు నమోదు చేయకపోవడం, ఇతర అంశాల పై చట్ట ప్రకారం ముందుకెళ్లవచ్చని పేర్కొంది. ఆదాయానికి మించి నిందితుడు రవికుమార్‌, కుటుంబ సభ్యులు సంపాదించిన ఆస్తుల వ్యవహారంపై చట్ట ప్రకారం ముందుకెళ్లే స్వేచ్ఛ సీఐడీ, ఏసీబీకి ఉందని తెలిపింది. మరోవైపు హుండీ సీలింగ్‌, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టనున్న సంస్కరణలకు సంబంధించి టీటీడీ ఈవో సమర్పించిన నివేదికపై తాము సంతృప్తిగా లేమని వ్యాఖ్యానించింది. పరకామణి సేవ కోసం స్వచ్ఛందంగా వచ్చే భక్తులను అమానవీయ పద్ధతిలో తనిఖీలు చేసే విధానాన్ని తప్పించి, ప్రత్యామ్నాయ పద్ధతిని తీసుకొచ్చే విషయమై, నివేదికలో ప్రస్తావన లేదని తెలిపింది. తనిఖీ చేయడంపై తమకు అభ్యంతరం లేదని భక్తులు చెప్పినప్పటికీ, ఇది మనిషి గౌరవానికి సంబంధించిందని గుర్తు చేసింది. ఈ వ్యవహారం రాజ్యాంగంలోని అధికరణ 21 పరిధిలోకి వస్తున్నందున, భక్తులు సైతం ఆ హక్కును వదులుకోలేరని తేల్చిచెప్పింది. అమానవీయ విధానంలో తనిఖీలు చేయడం నిలిపివేయలేని పరిస్థితి ఉంటే, పరకామణిలో భక్తుల సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులిస్తామని టీటీడీని హెచ్చరించింది. కానుకల లెక్కింపు కోసం టేబుళ్లు ఏర్పాటు చేయాలని కోర్టు చేసిన సూచనల విషయంలో, నివేదికలో ఎలాంటి ప్రస్తావన లేదని గుర్తు చేసింది. ఈ రెండు అంశాల పై స్పష్టత తీసుకొని, కోర్టు ముందుకు రావాలని టీటీడీ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande