
(అనంతపురం, 07 జనవరి (హి.స.):అరటి రైతుల మొహంపై ‘ధర’హాసం కనిపిస్తోంది. పాతాళానికి పడిపోయిన ధర ఇటీవల మళ్లీ పెరిగింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మొదటిపంట టన్ను రూ.21వేలు పలుకుతోంది. మండలంలో అరటి మొదటి పంటను 1200ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో ఎక్కువశాతం జనవరి నెలాఖరు, ఫిబ్రవరి నెలల్లో దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అప్పటికి అరటి ధరలు ఇంకాస్త పెరగవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ