
అమరావతి, 07 జనవరి (హి.స.)
కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ సైట్ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులు అవుతున్నా మంటలు ఆగటం లేదు. కానీ, బుధవారం నాటికి బ్లో అవుట్ తీవ్రత తగ్గింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్దికొద్దిగా అదుపులోకి వస్తున్నాయి. మంటలు నియంత్రించేందుకు వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. బ్లో అవుట్ వల్ల ఎలాంటి ముప్పులేదన డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ