
అమరావతి, 07 జనవరి (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ మంగళవారం కోర్ట్‌కు చేరింది. నేడు (బుధవారం) కోర్టు నుంచి ఆ రిపోర్టును సిట్ తీసుకునే అవకాశం కనబడుతోంది. ఆ రిపోర్ట్ ద్వారా ఏం బయటపడుతుందో అని నాయకులు, అధికారులు ఆందోళనలో మునిగిపోయారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ