
అమరావతి, 07 జనవరి (హి.స.)తూర్పు గోదావరి జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం దగ్ధం అయింది. బుధవారం తెల్లవారుజామున కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో సెల్ఫ్ మోటార్ షార్ట్‌సర్క్యూట్‌కు గురైంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ