.భూముల రీ సర్వే.అయిన.గ్రామాల్లో..సమస్యలు
అమరావతి, 07 జనవరి (హి.స.)‘భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఇందుకు కారణమెవరు? పాసు పుస్తకాల జారీలో కీలకమైన అంశాల్లో తప్పులు రావడమేమిటి? ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా!?’’ అంటూ రెవెన్యూ వర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నల
.భూముల రీ సర్వే.అయిన.గ్రామాల్లో..సమస్యలు


అమరావతి, 07 జనవరి (హి.స.)‘భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఇందుకు కారణమెవరు? పాసు పుస్తకాల జారీలో కీలకమైన అంశాల్లో తప్పులు రావడమేమిటి? ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా!?’’ అంటూ రెవెన్యూ వర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. జగన్‌ హయాంలో జరిగిన రీసర్వేలో తప్పుల తడకలు, వాటిని సరిదిద్దకుండానే ఇప్పుడు పాస్‌ పుస్తకాలు జారీ చేయడం, ఇతర కీలక అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి దీనిపై రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ఏ, ఇతర అధికారులతో ఆకస్మికంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రీసర్వేలో లోపాలు, రైతులెదుర్కొంటున్న సమస్యలు, పాస్‌ పుస్తకాల ముద్రణలో నెలకొన్న అంశాలపై ఆయన అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అద్భుతంగా చేస్తున్నాం’ అని చెబుతున్నా మౌలిక అంశాల్లో సమస్యలెందుకొస్తున్నాయని ప్రశ్నించారు.

రీ సర్వేలో లోపాలు, పాస్‌ పుస్తకాల్లో తప్పులపై రైతుల్లో నెలకొన్న సందేహాలు, సమస్యలకు రెవెన్యూశాఖ కార్యాచరణతో కూడిన స్పష్టత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం చివ్వరంలో జరిగిన రీసర్వేలో వచ్చిన తప్పులు, రైతుల ఆందోళనలను వివరిస్తూ ‘మళ్లీ అవే తప్పులు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ప్రచురించింది. పాస్‌ పుస్తకాల్లోని తప్పులు, సీఎం సొంత జిల్లాల్లోనే రైతులు ఎదుర్కొంటున్న చిక్కులపై ‘పాస్‌కాని పుస్తకాలు’ శీర్షికతో మరో వార్తను ప్రచురించింది. రైతుల్లో నెలకొన్న ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. మంగళవారం నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ అంశాలపైనే దృష్టి సారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande