తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ,ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు
అమరావతి, 07 జనవరి (హి.స.) తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకర
తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ,ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు


అమరావతి, 07 జనవరి (హి.స.)

తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

అనంతరం మీడియాతో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ అందరికి నమస్కారం. స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నేను నటించిన అనగనగా ఒక రాజు చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా హిట్ అవ్వాలి. అలాగే మాతో పాటు రిలీజ్ అవుతున్న అందరి సినిమాలు హిట్ అవాలి. నాగచైతన్యతో కలసి నటిస్తున్న చిత్రం ఈ ఏడాది విడుదలవుతుంది. మరికొన్ని ప్రాజెక్టుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను’ అని అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ ‘ స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని చిత్రాలు విజయవంతం కావాలి. కొత్త ప్రాజెక్టుల గురించి త్వరలో ప్రకటిస్తాను’ అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande