
అమరావతి, 07 జనవరి (హి.స.)
హైదరాబాద్: ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డీఎల్‌ఎన్ ప్రసాద్ (91) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్‌గా ప్రసాద్ పేరుగాంచారు. ఆయన సతీమణి ఇందిర, కుమార్తె గోగినేని ఉమ గతంలో తెనాలి ఎమ్మెల్యేలుగా పనిచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ