
న్యూఢిల్లీ, 07 జనవరి (హి.స.)
సేవా రంగం జోరు - జీడీపీలో సరికొత్త
ఊపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం.. దేశ వాస్తవ జీడీపీ (Real GDP) వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కానుంది. గత ఏడాది (2024-25) ఇది 6.5 శాతంగా ఉండగా, ఈసారి దాదాపు ఒక శాతం మేర వృద్ధి పెరగడం విశేషం. ఈ వేగానికి ప్రధాన ఇంధనం 'సేవా రంగం' (Services Sector) అని చెప్పవచ్చు. సేవా రంగం అద్భుతమైన పనితీరు కనబరుస్తుండటంతో, స్థూల విలువ జోడింపు (GVA) వృద్ధి రేటు కూడా 7.3 శాతంగా చెబుతున్నాయి. నమోదవుతుందని గణాంకాలు
రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాలు టాప్.. వ్యవసాయం డల్..
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాల్లో రంగాల వారీగా చూస్తే.. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఏకంగా 9.9 శాతం వృద్ధితో టాప్ గేర్ లో ఉన్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..