
హైదరాబాద్, 07 జనవరి (హి.స.)
నిషేధిత చైనీస్ మంజా విక్రయాలపై
నగర పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం, చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి నిర్వహించిన సంయుక్త దాడిలో చైనీస్ మంజాను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, BNS సెక్షన్లు 125, 223తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్లు 5, 15 కింద చర్యలు చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..