శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తాజాగా కిలో గంజాయి కస్టమ్స్ అధికారులు.స్వాధీనం
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}హైదరాబాద్,, 07 జనవరి (హి.స.) గంజాయి సరఫరా, వినియోగానికి పట్టుపగ్గాలు లేకుండా పోతోంది. డ్రగ్స్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తాజాగా కిలో గంజాయి కస్టమ్స్ అధికారులు.స్వాధీనం


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}హైదరాబాద్,, 07 జనవరి (హి.స.)

గంజాయి సరఫరా, వినియోగానికి పట్టుపగ్గాలు లేకుండా పోతోంది. డ్రగ్స్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలో హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫుకెట్ దేశం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఎయిర్ ఇండియా విమానం సీట్ నెంబర్ 16, 17 లలో హైడ్రోపోనిక్ గాంజాయి వదిలి వెళ్ళారు నిందితులు. రెండు సీట్ల కింద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఆ సీట్లలో ఎవరు ప్రయాణించారని అధికారులు విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande