శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత..
హైదరాబాద్, 07 జనవరి (హి.స.) హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి మత్తు పదార్థాల కలకలం చోటుచేసుకుంది. అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. ఫుకెట్ దేశం నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఎయిర
గంజాయి


హైదరాబాద్, 07 జనవరి (హి.స.)

హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి మత్తు పదార్థాల కలకలం చోటుచేసుకుంది. అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. ఫుకెట్ దేశం నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఈ గంజాయిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

విమానంలోని సీటు నంబర్లు 16, 17 వద్ద హైడ్రోపోనిక్ గంజాయిని వదిలివెళ్లినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. విదేశాల్లో మట్టి లేకుండా సాగు చేసే ఈ ప్రత్యేక రకం గంజాయి సుమారు ఒక కిలో వరకు ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande