కామారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున తహశీల్దార్ల బదిలీలు.. కలెక్టర్ ఉత్తర్వులు
కామారెడ్డి, 07 జనవరి (హి.స.) కామారెడ్డి జిల్లాలో భారీ సంఖ్యలో తహశీల్దార్లును బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేసినట్లుగా తెలుస్తోంది. జిల్లాలోని పిట్లం తహశీల్దార్ రాజా న
కామారెడ్డి కలెక్టర్


కామారెడ్డి, 07 జనవరి (హి.స.)

కామారెడ్డి జిల్లాలో భారీ సంఖ్యలో

తహశీల్దార్లును బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేసినట్లుగా తెలుస్తోంది. జిల్లాలోని పిట్లం తహశీల్దార్ రాజా నరేందర్ గౌడ్ను బాన్సువాడకు బదిలీ చేశారు. బాన్సువాడ తహశీల్దార్ వరప్రసాద్ను కామారెడ్డి కలెక్టరేట్ సూపరిండెంట్గా పంపించారు. కలెక్టరేట్ సూపరిండెంట్ మహేందర్ను పిట్లం తహశీల్దార్గా నియమించారు. నిజాంసాగర్ తహశీల్దార్ భిక్షపతి పెద్దకొడప్తల్కు ట్రాన్స్ఫర్ చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తూ పెద్ద కొడప్తల్ ఇన్ఛార్జి తహశీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న అనిల్ కుమార్ను ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande