
హైదరాబాద్, 07 జనవరి (హి.స.)
కేసీఆర్ భవిష్యత్తులో అసెంబ్లీకి రాడని.. వచ్చినా ప్రజలను పట్టించుకోడని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ సీఎస్పీ (CLP) మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం తెలంగాణ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని, తన వాదన వినిపిస్తారని తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారని, కానీ ఆయన కేవలం ముచ్చటగా 3 నిమిషాలు మాత్రమే సభలో ఉండి పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..