
చతిస్గడ్, 07 జనవరి (హి.స.)
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిపై రూ.64లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మన్యంలో మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని, పునరావాసంతో పాటు రివార్డులు అందజేస్తామని ఎస్పీ కోరారు. కాగా, లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..