మాటలు జాగ్రత్త.. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
హైదరాబాద్, 07 జనవరి (హి.స.) ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఉపయోగించిన భాష చూస్తుంటే కేటీఆర్ లోఅసహనం పరాకాష్టకు చేరిందని అన
Minister


హైదరాబాద్, 07 జనవరి (హి.స.)

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఉపయోగించిన భాష చూస్తుంటే కేటీఆర్ లోఅసహనం పరాకాష్టకు చేరిందని అన్నారు. ఈ మేరకు ఓ విడియో విడుదల చేసిన పొన్నం.. వరుస ఓటములతో సహనం కోల్పోతున్న కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్దోడ్ని అవుతానని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనంతరం దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించిన కుటుంబం వారిదన్నారు. రాహుల్ గాంధీపై ఇటువంటి భాష వాడితే గొప్ప వాడివి కాలేవని దుయ్యబట్టారు. ఇలాంటి భాషతో కేటీఆర్ తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారని ఇకనైనా రాహుల్ గాందీని ఈ రకంగా విమర్శించడం మానుకోవాలని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande