
నిజామాబాద్, 07 జనవరి (హి.స.) నిజామాబాద్ జిల్లా జైలులో గంజాయి
దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జైలులో డ్రగ్స్ పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతుందన్న ఆరోపణలపై జైళ్ల శాఖ డీఐజీ, ఐజీ పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా జైలర్ ఉపేందరన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్ను ఆదిలాబాద్కు బదిలీ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే సూపరింటెండెంట్ దశరథాన్ని నెల రోజులు సెలవులపై వెళ్లాలని ఆదేశించారు.
ఇక వరంగల్ జైలర్గా పనిచేస్తున్న పూర్ణచందర్కు నిజామాబాద్ జైలర్గా అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆనంద్రావుకు ఇంచార్జి సూపరింటెండెంట్గా బాధ్యతలు అప్పగించారు. జైలు అధికారులతో కలిసి పనిచేసినట్లు తేలిన ఖైదీలను ఇతర జైళ్లకు మార్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు