విశాఖపట్నం.కేంద్రంగా సౌత్.కోస్టల్ రైల్వే.జోన్ ఏర్పాటు
విశాఖ , 07 జనవరి (హి.స.) :భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఉత్తరాంధ్రకు మరో శుభవార్త అందింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయాల నిర్వహణ కోసం అ
విశాఖపట్నం.కేంద్రంగా సౌత్.కోస్టల్ రైల్వే.జోన్ ఏర్పాటు


విశాఖ , 07 జనవరి (హి.స.)

:భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఉత్తరాంధ్రకు మరో శుభవార్త అందింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయాల నిర్వహణ కోసం అవసరమైన ఉద్యోగుల కేటాయింపుపై రైల్వే అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌లో పని చేసేందుకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande