
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}చెన్నై,, 07 జనవరి (హి.స.)
ఈ ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు. జరగబోతున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార డీఎంకేను గద్దె దించేందుకు ఏకతాటిపైకి రావాలనే వ్యూహంతో ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమిలో పిఎంకె (PMK) పార్టీ చేరింది. ఇవాళ AIADMK అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం పళణిస్వామితో పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పళినిస్వామితో కలిసి రామదాస్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతూ ఏఐడీఎంకేతో పొత్తు కుదిరిందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తామంతా కలిసి పోటీ చేస్తామని తమిళనాడులో తప్పకుండా ఎన్డీయే (NDA Alliance) విజయం సాధించబోతోందని రామదాస్ ధీమా వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు