
హైదరాబాద్, 07 జనవరి (హి.స.)శాసనసభ ఐదు రోజుల పాటు సాగిన సమావేశాలు మంగళవారం రాత్రి ముగిసాయి. మొత్తం ఐదు రోజులు
జరగ్గా 13 బిల్లులు ఆమోదించారు.
దీనిలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ రెండో సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ, పంచాయతీరాజ్చట్ట సవరణ చేశారు. తెలంగాణ ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు, తెలంగాణ మోటార్ వెహికిల్స్ టాక్సేషన్ బిల్లులు సభలో చర్చించారు. అనంతరం ఉపాథి హామీ పథకంపై తీర్మానంపై చర్చ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని, పాత చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని సభ తీర్మానం చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్నా జిల్లాలపై, పోవలరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వోద్దు అంటూ తీర్మాణం చేసి కేంద్రానికి పంపించారు. ఉపాధి హామీని వ్యతిరేకిస్తూ పాత చట్టాన్ని పునరుద్దరించాలని తీర్మానించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు