ప్రయాణికులకు TGSRTC బ్యాడ్ న్యూస్.. సంక్రాంతికి భారీగా పెరగనున్న టికెట్ ధరలు
తెలంగాణ, 07 జనవరి (హి.స.) సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్తో పాటు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 6431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9,10,12,13 తేదీల్లో స్పెషల్ బస్సులు నడపాలని సంస్థ
TGSRTC బ్యాడ్


తెలంగాణ, 07 జనవరి (హి.స.)

సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్తో పాటు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 6431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9,10,12,13 తేదీల్లో స్పెషల్ బస్సులు నడపాలని సంస్థ నిర్ణయించింది. అదే విధంగా 18,19 తేదీల్లో ప్రయాణికుల తిరుగు ప్రయాణం సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్టు పేర్కొంది. హైదరాబాద్ లోని ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, మియాపూర్, కేపీహెచ్బి తదితర ప్రాంతాల నుండి స్పెషల్ బస్సులు నడవనున్నట్టు పేర్కొంది. మరోవైపు పండుగ సందర్భంగా టికెట్ ధరలు సైతం పెంచుతున్నట్టు ప్రకటించింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande