కేసీఆరే గెల‌వాల‌ని 90 శాతం వైసీపీ క్యాడ‌ర్ కోరుకుంటోంది !
Andhra Pradesh, 07 జనవరి (హి.స.) వైసీపీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి, గులాబీ పార్టీ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. 80 నుంచి 90 శాతం గులాబీ క్యాడర్, ఏపీలో వైసీపీ పార్టీ గెలవాలని కోరుకుంటోందని వెల్లడించారు. అదే సమయంలో 80 నుంచి 90 శాతం వైసీప
.


Andhra Pradesh, 07 జనవరి (హి.స.)

వైసీపీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి, గులాబీ పార్టీ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. 80 నుంచి 90 శాతం గులాబీ క్యాడర్, ఏపీలో వైసీపీ పార్టీ గెలవాలని కోరుకుంటోందని వెల్లడించారు. అదే సమయంలో 80 నుంచి 90 శాతం వైసీపీ కార్యకర్తలు కూడా తెలంగాణలో గులాబీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నార‌ని స్పష్టం చేశారు.

వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వైసీపీ క్యాడర్ కేసీఆర్ గెలవాలని కోరుకుంటున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి ( Kethireddy Venkatarami Reddy ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి, గులాబీ పార్టీ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. 80 నుంచి 90 శాతం గులాబీ క్యాడర్, ఏపీలో వైసీపీ పార్టీ గెలవాలని కోరుకుంటోందని వెల్లడించారు. అదే సమయంలో 80 నుంచి 90 శాతం వైసీపీ కార్యకర్తలు కూడా తెలంగాణలో గులాబీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నార‌ని స్పష్టం చేశారు.

ముందు నుంచి కేటీఆర్ (KTR ), కేసీఆర్ లతో (KCR ) వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( Ys Jaganmohanreddy) మంచి సంబంధాలు ఉన్నాయని ఈ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి షాకింగ్ నిజాలను బయటపెట్టారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు గురువు శిష్యులని, అందుకే వాళ్ళను ఓడించాలని వైసీపీ, గులాబీ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఏపీలో వైసీపీ క్యాడర్ పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని ఫైర్ అయ్యారు. అటు గులాబీ పార్టీ కార్యకర్తల పైన రేవంత్ రెడ్డి కూడా కేసులు పెడుతున్నట్లు చెప్పుకొచ్చార

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande