
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,07జనవరి (హి.స.)పాకిస్థాన్ ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో పశ్చిమ దేశాలు కపటత్వం ప్రదర్శించడంపై విదేశాంగ మంత్రి జై శంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు (Jaishankar on Operation Sindoor). తమకు వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ దేశాలు ఉద్రిక్తతల సమయంలో ఆందోళన చెందినట్లు చెప్పాయని.. కానీ అవేవీ తమ సొంత ప్రాంతంలో జరుగుతున్న వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. లక్సెంబర్గ్‌లోని భారత కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సాయం చేయాలనుకునే వారితో కలిసి పని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని జైశంకర్ (S Jaishankar) పేర్కొన్నారు. అదే.. పాకిస్థాన్‌లా ప్రవర్తిస్తే మాత్రం వాటికి అలాగే సమాధానం చెబుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరిగే పరిణామాలు దేనిని ఏమేరకు ప్రభావితం చేస్తాయో చెప్పడం కష్టమన్నారు. ఆలోచన లేకుండా ఎక్కడో దూరంగా కూర్చొన్నవారు.. ఉచిత సలహాలు ఇస్తున్నారని, అవి కొన్నిసార్లు స్వార్థంగా, నిర్లక్ష్యంగా ఉంటున్నాయన్నారు. ప్రస్తుతం చాలా దేశాలు తమ స్వార్థం కోసం మాత్రమే పని చేస్తున్నాయన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై పలు దేశాలు భారత్‌కు సలహాలు ఇచ్చాయన్నారు. కానీ అవేవీ పట్టించుకోకుండా దేశ భద్రత కోసం భారత్ ముందుకుసాగిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు