ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టుపై.. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక ప్రకటన
మచిలీపట్నం, 07 జనవరి (హి.స.) ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టుపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు... ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టుపై.. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక ప్రకటనను వీలైనంత త్వరగా పూర్తి చేసి తీరుతామని మంత్రి బీసీ జనార్ధన్ ర
మచిలీపట్నంలో


మచిలీపట్నం, 07 జనవరి (హి.స.)

ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టుపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు...

ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టుపై.. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక ప్రకటనను వీలైనంత త్వరగా పూర్తి చేసి తీరుతామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నంలో రూ. 39 కోట్ల విలువైన రహదారుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మచిలీపట్నంలో రోడ్ల ప్రతిపాదనలను జాతీయ రహదారుల సంస్థ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లు ఆర్ అండ్ బీ శాఖ ఉందా అనేలా రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని చెప్పారు. గతంలో పరిశ్రమల్ని తరిమేస్తే తాము పెట్టుబడి పెడతామని పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ మేరకు పరిశ్రమలను ఏపీకి తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఆర్ధిక ఇబ్బందులున్నా.. సంక్షేమం, అభివృద్ధిని విస్మరించకుండా ముందుకెళ్తున్నామన్నారు. ఏ సంబంధం లేని కేసుల్లో టీడీపీ నేతల్ని అరెస్టు చేసి పైశాచికానందం పొందారని బీసీ జనార్థన్ రెడ్డి విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande