మదురో కిడ్నాప్‌పై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{} ఢిల్లీ.,07జనవరి (హి.స
మదురో కిడ్నాప్‌పై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ.,07జనవరి (హి.స.)వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్‌ చేయడంపై భారత విదేశాగం మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నికోలస్ మదురోను కిడ్నాప్ చేయడంపై భారతదేశం ఆందోళన చెందినట్లుగా తెలిపారు. లక్సెంబర్గ్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి జేవియర్ బెట్టెల్‌తో జరిగిన సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ సహకారంపై చర్చించారు.

వెనిజులాతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని.. అలాంటిది మదురోను కిడ్నాప్ చేసిన తర్వాత ఆందోళన చెందినట్లుగా చెప్పారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పక్షాలను కోరారు. ‘‘అవును.. వెనిజులాలో జరుగుతున్న పరిణామాల పట్ల మేము ఆందోళన చెందుతున్నాము. ఆ దేశంతో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని పక్షాలు ఒక వైఖరికి రావాలని మేము కోరుతున్నాము.’’ అని జైశంకర్ స్పష్టం చేశారు. ఇక భారతదేశం-లక్సెంబర్గ్ 78 సంవత్సరాల దౌత్య సంబంధాలను పంచుకున్నాయని పేర్కొన్నారు.

గత శనివారం వెనిజులాపై అమెరికా సైన్యం దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చారు. అనంతరం డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే అమెరికా సైనిక దాడిలో 32 మంది వెనిజులా భద్రతా అధికారులు చనిపోయినట్లుగా నివేదికలు అందుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande