వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. MLA షాకింగ్ కామెంట్స్
కైకలూరు, 07 జనవరి (హి.స.)బీజేపీ సీనియర్ నేత, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పకుందామని అనుకున్నాను. అ
kaikalur-mla-kamineni-srinivasa


కైకలూరు, 07 జనవరి (హి.స.)బీజేపీ సీనియర్ నేత, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ సీనియర్ నేత, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పకుందామని అనుకున్నాను. అందరూ కోరుకోవడంతో పాటు మీరే పోటీ చేయాలని బలవంతం చేయడంతో 2024 ఎన్నికల్లో పోటీ చేశాను. అనూహ్యంగా ఈసారి ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీ కూడా వచ్చింది. భవిష్యత్‌లో నేను, నా కుటుంబం నుంచి ఎవరం ఎన్నికల్లో పోటీ చేయం. రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటా. ఇక నుంచి నియోజకవర్గంలో ఎవరైనా అన్యాయం, అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించబోం’ అని కామినేని శ్రీనివాస రావు హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. మంగళవారం సంక్రాంతి పండుగ నేపథ్యంలో ‘జూదాలు వద్దు - సాంప్రదాయ క్రీడలే ముద్దు’ అని కామినేని నినాదించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande