
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,07జనవరి (హి.స.)ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన దగ్గరి నుంచి డిస్కౌంట్ ధరకు లభిస్తోన్న రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తోన్న సంగతి తెలిసిందే (Russian Oil). అప్పటినుంచి 144 బిలియన్ యూరోల (రూ.15 లక్షల కోట్ల విలువైన) క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. దిగుమతి చేసుకున్న మొత్తం శిలాజ ఇంధనాల విలువ 162.5 బిలియన్ యూరోలుగా ఉంది. ఈ మేరకు ఐరోపా సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ఎయిర్ (CREA) వెల్లడించింది. అలాగే ఫిబ్రవరి, 2022 (యుద్ధం మొదలైన ఏడాది) నుంచి ప్రపంచ దేశాలకు చమురు అమ్మడం ద్వారా రష్యా ఒక ట్రిలియన్ యూరోల ఆదాయాన్ని పొందిందని అంచనా వేసింది.
రష్యా (Russia) రాయితీ ధరలకు చమురును విక్రయించడం ప్రారంభించడంతో చైనా తర్వాత మన దేశం అతిపెద్ద దిగుమతిదారుగా మారింది. ఫలితంగా మొత్తం మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1% నుంచి 40 శాతానికి చేరింది. ఇక చైనా 210.3 బిలియన్ యూరోల చమురును కొనుగోలు చేసిందని సీఆర్‌ఈఏ వెల్లడించింది. గ్యాస్, బొగ్గు దిగుమతులతో కలిపి ఆ మొత్తం 293.7 బిలియన్ యూరోలుగా ఉందని తెలిపిం
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు